నాకు పిచ్చిపడుతుందని చాలా భయంగా వుందండీ, అంటూ భయం భయంగా చెప్తూ కూర్చుంది ఒక నిండు గర్భిణి.
మీకా భయం అక్కర్లేదు, మీకు పిచ్చిపట్టకుండా చేస్తాను, ఐనా ఇంత ఆరోగ్యంగా ఉన్న మీకు పిచ్చి ఎందుకు పడుతుంది, అని అడిగాను
ఏమో నాకే తెలీదు. గారంటీగా పిచ్చిపడుతుందనే నమ్మకం ఉంది. బట్టలు చింపేసుకుని జుట్టు విరబోసుకుని పరుగులు పెడతానేమో అని కంగారుగా ఉంది..అంది దాదాపు ఏడుస్తూ...
ఏం పరవాలేదని ధైర్యం చెప్పి, మెల్లగా మాటల్లోకి దించి, వివరాలన్నీ కూపీ లాగాను. ఏ రకమైన మానసిక సమస్యకైనా కారణం ఉండి తీరుతుంది. అది బాల్య దశ అనుభవాలు గుర్తొచ్చి కావచ్చు, పరిసరాల ప్రభావం పక్కవారి ప్రవర్తనలు కావచు, పెరిగిన వాతావరణాన్ని బట్టి కొందరు ఎటువంటి సమస్యనైనా తేలికగా తీసుకుని పరిష్కరించుకుంటారు. కొందరు సమస్యను తలుచుకుని కుమిలిపోతారు. మరికొందరు సమస్యను
మరింత జటిలం చేసుకుని మానసిక ఆందోళనకు లోనవుతారు. ఈమె పరిస్థితిలో సరిగ్గా అదే జరిగింద్.
రెండు రోజుల క్రితం మధ్యాహ్నం భోజనం చేసి రిలాక్స్ అవుదామని వీధి వరండాలో కూర్చుందట. ఆ సమయంలో రోడ్డు మీద ఒక పిచ్చి పట్టిన అమ్మాయి అరుస్తూంటే అటు చూసింది. ఆమె నిండు గర్భిణీ, ఒక రిక్షావాల ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె అరుపులు ఎవరికీ వినబడలేదు. పైగా మధ్యాహ్నం రోడ్డుపై జనసంచారం కూడా అట్టే లేదు. ఆ దృస్యం చూసిన తరువాత హఠాత్తుగా ఆమె మనసులో ఒక భయం మెదిలింది. నాకు కూడా పిచ్చిపడితే నన్ను కూడా మా ఇట్లో వారు కూడా ఇలా చేస్తారేమో ననే చిన్న ఆందోళన ప్రారంభమై, గంట తిరిగేలోగా, తీవ్రస్థాయికి చేరింది..దానికి కారణం కూడా లేకపోలేదు. తన తల్లిదండ్రులకి, అత్తమామలకి మాటా మాటా వచ్చి కాంపుకి కూడా పుట్టింటికి పంపడానికి నిరాకరించింది అత్త, మిగిలిన వారు సూటి పోటి మాటలతో యధాశక్తి వేధించారు. అటువంటి అభద్రతా భావనలో ఉన్న ఆమెకు ఇటువంటి ఆలోచన రావడం సహజమే.
భర్త భయపడి గైనకాలగిస్టు వద్దకు తీసుకెళ్ళాడు. ఆమె పరీక్ష చేసి, ఈ సమయంలో ట్రాంక్విలైజర్స్ ఇవ్వడం మంచిది కాదు. సైకాలజిస్టుకి చూపించండి...సైకియాట్రిస్టు కాదు అని చెప్తే నాదగ్గరకి వచ్చారు.
ఓకే నీకు పిచ్చిపట్టకుండా చేస్తాను ఈ కాగితం మీద నేను చెప్పినట్టు వ్రాయి..అని పెన్ను కూడా ఇచ్చి డిక్టేట్ చేసాను.
'నాకు పిచ్చి పట్టదు ' ఎందుకంటే మా అమ్మా నాన్నలకు పిచ్చిలేదు, మా ఇంట్లో ఎవరికీ పిచ్చిలేదు నేను చూసిన పిచ్చి అమ్మాయికి చిన్నప్పటినుంచి పిచ్చి ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలు పిచ్చివాళ్ళు, కాబట్టి ఆ అమ్మాయికి పిచ్చి వచ్చింది.
ఈ విధంగా మూడు సార్లు వ్రాయమన్నాను. మరి నా ట్రీట్ మెంటో అంది భయంగా ..
తప్పకుండా చేస్తాను, ముందు ఇది వ్రాయండి అన్నాను.
అర్ధాంగీకారంతోనే ఐదు సార్లు వ్రాసింది, ఓకే ట్రీట్ మెంట్ మొదలెట్టండి అంది..
అప్ప్పుడే ఎక్కడా ఈ విధంగా రోజుకీఇదు సార్లు చొప్పున ఐదు రోజులు వ్రాయాలి అప్పుడు గంటలో ట్రీట్ మెంట్ పూర్తవుతుంది! అన్నాను..
అబ్బా ఐదు రోజులే అంది..అసహనంగా.
తప్పదు! అని చెప్పి , ఇద్దరినీ పంపించివేసాను. ఆమె రెండు రోజులు బాగానే రాసిందని భర్త ఫోన్ చేసి చెప్పాడు. మూడో రోజు మాత్రం చికాకుగా..అసలు సైకాలజిస్టులకు వేపకాయంత వెర్రి ఉంటుందేమో....ఇలాంటి పిచ్చి రాతలు రాయమంటారు: అని విసుక్కుంటూ రాసిందట. నాలుగో రోజు మాత్రం భర్త గారిని ..నాకు ససేమిరా రాయాలని లేదు..ఒక సారి ఆయన్ని కలుద్దాం తీసుకెల్లండి..అంటే తీసుకొచ్చాడు.
ఏవమ్మా రాశావా? గంభీరంగా అడిగాను.
రాయలేదు అంతకన్నా గంభీరంగా చెప్పింది..
ఏం ఎందుకు..రాయలేదు..హెచ్చు స్వరం తోనే అడిగాను..
దాంతో ఆమెకు చర్రూన కోపం వచ్చి మీకేమైనా పిచ్చా..ఈ రాతలేంటి.అర్ధం లేని రాతలు..నాకేమీ పిచ్చి లేదు..మా అమ్మానాన్నలకు పిచ్చిలేదు అంటూ పిచ్చి పిచ్చి వన్నీ డిక్టేట్ చేసారు. అవి రాస్తుంటే నిజంగానే పిచ్చిపడుతోంది. అంది ఊగిపోతూ,..
అంటే మీకు పిచ్చిలేదే గట్టిగానే అడిగాను..
లేదు..లేదు..లేదు ...మీకే పిచ్చీ ఉందేమో అంది కోపంగా..
ఐతే మీకు పిచ్చి పట్టదా..
ఖచ్చితంగా పట్టదు..కాంఫిడెంట్ గా చెప్పింది..
వెరీ గుడ్ ..మీ ట్రీట్ మెంట్ అయిపోయింది ఫీజ్ ఇచ్చేయండి అన్నాను నవ్వుతూ...
ఆ ! అని ఇద్దరూ నోరు తెరిచారు. ఆ తర్వాత గట్టిగా నవ్వారు, సంతోషంగా వెళ్ళారు. వారం రోజులకు బంగారంలాంటి బిడ్డకు జన్మనిచ్చింది..
ఈ రకమైన కౌన్సిలింగ్ ని "రీ ఇంఫోర్స్డ్ సజెషన్" అంటారు పదే పదే అనుకూల సజెషన్ లు అనుకుంటే అన్ని సక్రమంగా అవుతాయి..పైగా ఆమె మొదటి సారి వచ్చినప్పుడు ఆమెకు సజెషన్ లు ఇచ్చి గుర్తించలేని ట్రాన్స్ లోకి పంపడం కూడా జరిగింది..నెగిటివ్ ఆలోచనలను పాజిటివ్ గా చెయ్యడమే ఇందులోని ప్రక్రియ...
9, ఏప్రిల్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ప్రముఖ పోస్ట్‌లు
-
“Peace in Afghanistan will pave way to World Peace” - Dr Ghazal Srinivas My First Step... My visit to Afghanistan has been a long cher...
-
అభిమానం ముదిరితే అనుమానమే మగవాళ్ళు ...
-
కొంపలు ముంచే కోపం "మా ఇంట్లో నా మాటకెవరైనా ఎదురుచెప్తే భరించలేకపోతున్నాను సార్! చేతిల...
-
Andhra Jyothy Telugu News Paper Online edition published from Andhra Pradesh, India http://bvpattabhiram.muzigle.com పట్టాభిరామాయణం-పరి...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి