జాకబ్ సన్ రిలాక్సేషన్
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, క్షతగాత్రులైన సైనికులు అనేక మానసిక రుగ్మతలకు లోనయ్యారు. ఎక్కడో యుద్ధభూమిలో వుండిపోయిన సైనికులకు కౌన్సిలింగ్ చేయడానికి వైద్యులకు అవకాశం లేకపోయింది. ఆ సమయంలో డాక్టర్ ఎడ్మండ్ జాకబ్ సన్ అనే మహావ్యక్తి వారికి రేడియో ద్వారా రిలాక్సేషన్ సజెషన్లు వరుసగా నాలుగురోజులు వినిపించాడు. ఫలితం అనూహ్యం! ఎందరో సైనికులు తమ భయభ్రాంతుల నుంచి బయటపడ్డారు. ఆ విధంగా రిలాక్సేషన్ సజెషన్లు వినిపించిన డాక్టరుకన్నా, ప్రపంచవ్యాప్త్రంగా ఆ సజెషన్లు వినిపించడానికి అనుమతినిచ్చిన దేశాధినేతలను ఆనాటి పత్రికలు ఎంతగానో శ్లాఘించాయి.
శారీరక విశ్రాంతి ద్వారా మానసిక విశ్రాంతిని అనుభవించవచ్చునని డాక్టర్ జాకబ్ సన్ పరిశోధనలో తేలింది. అంతకుముందు మన యోగశాస్త్రంలో ఈ విషయం నిర్ధారించినప్పటికీ, విదేశీయులు జాకబ్ సన్ టెక్నిక్కును వెంటనే ఆమోదించారు. కారణమేమిటంటే, ఈ వ్యాయామం చేయడానికి ప్రత్యేకమైన ఆసనాలేమీ లేవు. నేలమీద వెల్లకిలా పడుకుంటే చాలు. మన శవాసనంలాగా, దీని ప్రత్యేకత ఏంటంటే కండరాలను ఒకసారి బిగబట్టి, అంటే టెన్స్ చేసి, తరువాత వదులుచేయడమే.
జాకబ్ సన్ రిలాక్సేషన్ గురించి మన సైకియాట్రిస్టులూ, సైకాలజిస్టులూ, తమ వద్దకు చికిత్సకు వచ్చినవారికి చెబుతుంటారు. అయితే ఇంతవరకూ అందరూ అనుకుంటున్న జాకబ్ సన్ రిలాక్సేషన్ కు కొన్ని కొత్త సజెషన్లు కలిపి జాకబ్ సన్ మనవడు ఇటీవల ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు అందించి అపారమైన సహాయం చేశాడు. దానిని నేను మీకు ఇప్పుడు అందిస్తున్నాను. ఇది ఒకటి రెండుసార్లు చదివి తరువాత మీరు ఎవరిమీదైనా ప్రయోగించవచ్చు. లేదా రికార్డు చేసుకుని మీరే వినవచ్చు.
ఈ రిలాక్సేషన్ చేసేముందు మీరు మీ సబ్జెక్టును (వ్యక్తి) నేల మీద పడుకుని మీరు వింటున్నట్లుగా వింటూ కళ్ళు మూసుకుని చేయమని చెప్పండి. ఈ వ్యాయామంలో వారు ఆలోచించుకునే హిప్నాటిక్ సజెషన్లు ఏవీ ఉండవు. ఇందులో శ్వాస తీసుకునే ఎక్సర్ సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీరు ఎంతవరకు తీసుకోగలరో, ఎంత సాధ్యమో అంతే తీసుకోండి. గుండెకు సంబంధించిన సమస్యలున్నవారు, దీన్ని చేయకపోవడం మంచిది. మీరీ విధంగా సజెషన్లు ఇవ్వటం ప్రారంభించండి.
‘రిలాక్స్...రిలాక్స్....రిలాక్స్... ఇప్పుడు కళ్ళు మూసుకోండి.. మీ కుడిచేతి పిడికిలిని గట్టిగా బిగించి దీర్ఘమైన శ్వాస తీసుకోండి..
ఇప్పుడు శ్వాసను వదలండి.. పిడికిలి వదులుచేయండి’.
“ఇప్పుడు మీ కుడిచేతిని కుడి భుజానికి తగిలించి పిడికిలి బిగించి శ్వాస తీసుకోండి...శ్వాస వదలండి. కుడిచేతిని యథాస్థానంలో ఉంచండి..(కాసేపు విరామం)’
‘ఇప్పుడు ఎడమచేతి పిడికిలి బిగించి, శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి.. ఎడమచేతిని ఎడమ భుజానికి ఆనించి, పిడికిలి బిగించి శ్వాస తీసుకోండి...వదలండి.. ఎడమచేతిని యథాస్థానంలో ఉంచండి. (ఐదు సెకన్లు) ఇప్పుడు కుడికాలి వేళ్ళను మూ వైపు ఉంచి, కుడిచేతి పిడికిలిని బిగించి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి... ఇలా చేయడం వల్ల కుడిచేతి, కుడికాలి కండరాలు బాగా బిగుసుకుని, అంటే టెన్స్ అయ్యి అనంతరం రిలాక్స్ అవుతాయి. ఒకవేళ కొవ్వెక్కిన కండరాలుంటే అవి వ్యాయామం వల్ల చురుకవుతాయి.’
‘ఇప్పుడు ఇదే విధమైన వ్యాయామం ఎడమకాలి వేళ్లతో, ఎడమ పిడికిలితో చేయండి.
‘ఇప్పుడు మీ తలను ముందుకు వంచండి. అంటే మీ గడ్డం, చాతీ మిద ఆనాలి. ఇప్పిడు ఆ కండరాలను బిగించండి.. వదులుచేయాలి”
‘ఇప్పుడు మీ తలను కుడిపక్కకు తిప్పి, కండరాలను బిగించి శ్వాస తీసుకోండి. వదలండి. అదేవిధంగా తలను ఎడమపక్కకు తిప్పి, కండరాలను బిగించి శ్వాస తీసుకోండి. వదలండి. రిలాక్స్...రిలాక్స్...రిలాక్స్..’
‘ఇప్పుడు ముఖం మీది కండరాలు రిలాక్స్ అయ్యే వ్యాయామం చేయండి.. ముందుగా నుదుటిమీది కండరాలను బిగించండి. దీనికి కనుబొమ్మలను పైకెత్తాలి. ఓ..కే...’
వదులు చేయండి... ఇప్పుడు కళ్ళ కండరాలను బిగించండి. అంటే కళ్ళు గట్టిగా మూయండి...వదులు చేయండి..
‘ఇప్పుడు నోటికి సంబంధించిన వ్యాయామం. మీ దంతాలను గట్టిగా నొక్కి పెట్టండి.. వదులు చేయండి.. మీ పెదాలను గట్టిగా బిగించండి.. వదలండి. నాలుకను పూర్తిగా బయటకు చాపి శ్వాస తీసుకోండి.. వదలండి’
‘ఛాతీకి సంబంధించిన ఈ వ్యాయామం జాగ్రత్తగా చేయాలి. దీర్ఘమైన శ్వాస తీసుకుని.. కొంత సమయం ఉంచి, వదలండి.. ఈ వ్యాయామం చేసేటప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బి ఆకాశాన్ని తాకినట్లూ, శ్వాస వదిలినప్పుడు పొట్ట భూమిలొకి పోయినట్టూ ఉండాలట. అంటే అంత దీర్ఘంగా తీసుకోవాలి... దీనివల్ల మీ గుండె, ఇతర ప్రాంతాల్లోని కండరాలు బాగా రిలాక్స్ అయ్యి ప్రశాంతత కలుగుతుంది. ఇలా ఆరుసార్లు చెయ్యండి.’
‘చివరగా నెమ్మదిగా కళ్ళు తెరిచి కొంతసేపు అలాగే శవాసనంలో ఉండి, నెమ్మదిగా లేచి కూర్చోండి. ఈ విధంగా వారం రోజులు చేసినవారికి మానసిక ప్రశాంతి తప్పక లభిస్తుంది.’
పట్టాభిరామాయణం-పరిశోధనల పారాయణం
వ్యక్తిత్వ వికాసం-పాఠకులకు ప్రకాశం
Happyness is our Choice

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి